MBNR: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధత అనే అంశంపై శనివారం పాలమూరు యూనివర్సిటీలో BC మేధావుల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి డాక్టర్ విశారాదన్ మహరాజ్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవిలు హాజర్ కానున్నట్లు బీసీ సంఘం నేతలు తెలిపారు. బీసీ వర్గాలకు చెందిన అందరూ సమావేశానికి హాజరుకావాలని వారు కోరారు.