CTR: పులిచెర్ల (M) గడ్డంవారిపల్లి గ్రామపంచాయతీలో మండల తెలుగుదేశం పార్టీ పరిశీలకులు P. రామకృష్ణ ఆచారి ఆధ్వర్యంలో శనివారం గ్రామ కమిటీ వేశారు. గ్రామ కమిటీ అధ్యక్షులుగా G.సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా B.సురేష్, ప్రధాన కార్యదర్శిగా S. శ్రీనులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.