వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మాచాడో ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన విషయం తెలిసిందే. అయితే, ఆమెకు కొత్త చిక్కులు ఎదురయ్యాయి. డిసెంబర్ 10న నార్వేలో నోబెల్ ప్రదానోత్సవానికి ఆమె దేశం దాటి వెళ్లడానికి ప్రయత్నిస్తే.. ‘పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తాం’ అని వెనెజువెలా స్పష్టం చేసింది. కాగా, దేశంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆమెపై కేసులు ఉన్నాయి.