VSP: విశాఖ కలెక్టరేట్లో భగవాన్ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ మీటింగు హాలులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ పాల్గొని సత్యసాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.