సత్యసాయి: పెనుకొండలోని అన్నా క్యాంటీన్ వద్ద శ్రీ సత్యసాయి బాబా శత జయంతి పురస్కరించుకుని టీడీపీ నాయకులు బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబా జయంతి సందర్భంగా మంత్రి సవిత ప్రజలకు ఉచిత అన్నదానం చేశారు. పెనుకొండలో 867 రోజులుగా అన్నా క్యాంటీన్‌ను నిర్వహించడం మంత్రి సవిత సేవాతత్పరతకు నిదర్శనమని టీడీపీ పట్టణ అధ్యక్షులు శ్రీరాములు తెలిపారు.