W.G: మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ ఆదివారం పర్యాటక శోభను సంతరించుకుంది. కార్తీక మాసం ముగిసినప్పటికీ, సెలవు దినం కావడంతో జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. కుటుంబ సమేతంగా వచ్చిన వారు సముద్ర స్నానాలు ఆచరించి, ఇసుక తిన్నెలపై ఆడుకుంటూ ఉల్లాసంగా గడిపారు. అనంతరం తీరంలోని ఆలయాలను దర్శించుకున్నారు.