ATP: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాప్తాడు జాతీయ రహదారి సమీపంలో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు రాజశేఖర్‌రెడ్డి కుమార్తె మోక్షిత విష్ణుప్రియా రెడ్డి వివాహంలో పాల్గొన్న జగన్, నూతన వధూవరులు తేజేష్ రెడ్డి, మోక్షితలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.