MHBD: బయ్యారం మండలం మిర్యాలపెంట క్రాస్ రోడ్డు వద్ద ఇవాళ మధ్యాహ్నం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారంను అందించారు. 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ఇల్లందు ఆసుపత్రికి తరలించారు.