కర్నూలు: జిల్లాలో రేపటి నుంచి 29వ తేదీ వరకు ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఎ.సిరి అధికారులను ఆదివారం ఆదేశించారు. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బందితో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వెళ్లి రైతులకు పంచ సూత్రాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.