తమిళనాడులో మెట్రో రైలు ప్రాజెక్టుల వివాదం కేంద్రం, స్టాలిన్ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. మధురై, కోయింబత్తూర్ మెట్రో ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన CM స్టాలిన్, TN అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కేంద్రంపై ఆరోపించారు. భూసేకరణలో సమస్యలు రాకుండా చూస్తామని హామీ ఇచ్చిన స్టాలిన్, పునఃపరిశీలించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు.