అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతి ప్రణాళికపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్ దీన్ని అంగీకరించి తీరాల్సిందేనని అన్నారు. కీవ్, దాని నాటో మిత్రదేశాలు ఇప్పటికీ భ్రమల్లోనే జీవిస్తున్నాయని వ్యాఖ్యానించారు. యుద్ధంలో రష్యాను ఓడించగలమని వారు కలలు కంటున్నారని పేర్కొన్నారు. యుద్ధం ముగింపునకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ వెల్లడించారు.