గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీబ్రేక్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా మరో వికెట్ను కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో రికెల్టన్ (35) రిషభ్ పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 82 పరుగుల వద్ద సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో టెంబా బవుమా (8*), స్టబ్స్ (2*) ఉన్నారు. 30 ఓవర్లకు స్కోర్ 92/2గా ఉంది.