ADB: భీంపూర్లో ASP సురేందర్ రావు ఆధ్వర్యంలో శనివారం కాంటాక్ట్ కమ్యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గ్రామాలలోని ప్రజలు నాటుసారా, గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో CI శ్రవణ్, SI విక్రమ్, సిబ్బంది తదితరులున్నారు.