ఉప్పును అధికంగా తింటే శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తనాళాల గోడలపై ఒత్తిడి పడుతుంది. దీంతో రక్త సరఫరాకు ఆటంకం కలుగుతుంది. ఫలితంగా బీపీ పెరుగుతుంది. మీకు బీపీ ఉన్నట్లుండి సడెన్గా పెరిగి అది అలాగే కొనసాగుతూ ఉంటే మీరు ఉప్పును ఎక్కువగా తింటున్నారేమో పరిశీలించండి. ఉప్పును తక్కువగా తీసుకోండి. లేదా కొన్ని రోజులు మానేయండి. దీంతో బీపీని ఆరంభంలోనే తగ్గించుకోవచ్చు.