వనపర్తి జిల్లా ఇండోర్ స్టేడియంలో సుమారు రూ.20 లక్షలతో నిర్మించిన ఉడెన్ షటిల్ కోర్ట్, జిమ్ ఈరోజు మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే తూడి మెఘారెడ్డి ప్రారంభించనున్నారు. రూ.12 లక్షలతో ఉడెన్కోట్, రూ.7 లక్షలతో జిమ్, సుమారు లక్షన్నరతో స్టేడియం డయాస్‌పై టాప్ నిర్మించేందుకు ప్రభుత్వం ఖర్చు చేసిందని సంబంధిత అధికారి తెలిపారు.