BDK: అటవీ శాఖ అధికారి చలమల శ్రీనివాసరావు మూడవ వర్ధంతి సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని మెమోరియల్ పార్కులో వారి విగ్రహానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే పాట పాడి శ్రీనివాసరావు అడవి తల్లికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన చేసిన సేవలు నేటికీ మరువలేమని అన్నారు. వారితోపాటు అటవీశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.