BDK: దేశంలో నిరంకుశ పాలనను కొనసాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఓట్ చోరీకి బీజేపీ ప్రభుత్వం పాల్పడుతుందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. మున్సిపాలిటీ వ్యాప్తంగా ఓటు చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు. నేడు సంతకాల సేకరణ పత్రాలను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేకు అందించారు. ఓట్ చోరిపై ప్రజలలో అవగాహన కల్పించాలని అన్నారు.