ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టులో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ టెస్టులో ఓ చెత్త రికార్డు నమోదైంది. వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క పరుగు తీయకుండా ఓపెనింగ్ భాగస్వామ్యం బ్రేక్ అవడం టెస్టు క్రికెట్లో ఇదే తొలిసారి. ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో క్రాలే, ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో వెదరాల్డ్ డకౌట్ అయ్యారు.