AP: పుట్టపర్తిలో శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టపర్తికి వచ్చి సత్యసాయి మహాసమాధిని దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి వెంట TG సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు వస్తున్నారు. వారిని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆహ్వానించనున్నారు.