దేశంలో త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రష్యా నుంచి తక్కువ ధరకు వస్తున్న ముడి చమురు దిగుమతులు తగ్గడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. రష్యా ఆయిల్ సంస్థలపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో కొన్ని భారత కంపెనీలు కొనుగోళ్లు ఆపేశాయి. ఫలితంగా US, పశ్చిమాసియా నుంచి అధిక ధరకు చమురు దిగుమతి చేసుకుంటే, ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది.