కాంబోడియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 16 మంది మృతిచెందారు. మరో 24 మంది గాయపడ్డారు. సీమ్ రీప్ నుంచి రాజధాని ఫ్రోమ్ పెన్ వస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్లు సమాచారం. మృతుల్లో డ్రైవర్ ఉన్నాడా? లేదా అనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు.