NLR: బెంగళూరు నుంచి సీబీఐ అధికారులమని నమ్మించి మహిళలకు అసభ్యకరమైన ఫొటోలు పంపినందుకు అరెస్టు చేస్తున్నామని భయపెట్టి, నెల్లూరు రూరల్లో ఒక శాస్త్రవేత్తను సైబర్ నేరగాళ్లు రూ. 23 లక్షలు మోసం చేశారు. ఈ ఘటనపై ఇవాళ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.