నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆదిత్య 369’కు సీక్వెల్గా ‘ఆదిత్య 999 మ్యాక్స్’ రాబోతున్నట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై బాలకృష్ణ స్పందిస్తూ.. ‘ఆదిత్య 369’కు సీక్వెల్ ఉందని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమాలో తన తనయుడు మోక్షజ్ఞ భాగం కాబోతున్నట్లు వెల్లడించారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.