GDWL: మల్దకల్ ఆదిశిలా క్షేత్రం శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ, ఈవో సత్య చంద్రారెడ్డిల ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కారాక్రమం జరిగింది. భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకల ద్వారా రూ. 21,82,936 లక్షల ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు. ఈ ఆదాయం ముందు సంవత్సరం కంటే భారీ స్థాయిలో పెద్దది అన్నారు.