AP: రాజధాని రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. 34,900 ఎకరాల్లో 34,700 ఎకరాలకు ఏ ఇబ్బందుల్లేవు అని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 700 ఎకరాల్లో మాత్రమే సమస్యలు ఉన్నాయని, జరీబు భూముల్లో 200 ఎకరాలు మాత్రమే సమస్య ఉందన్నారు. జరీబు భూములకు 30 రోజుల్లో పరిష్కారం చూపుతామన్నారు. 6 నెలల్లో అమరావతి రైతుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి నారాయణ తెలిపారు.