ప్రకాశం: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల కృష్ణ అన్నారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్, ఎల్.ఎల్.ఆర్. మంజూరు కోసం శుక్రవారం ఒంగోలులోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రవాణా శాఖ సిబ్బంది ఆన్లైన్ ద్వారా LLR, లైసెన్స్ స్లాట్లను బుక్ చేయడం జరుగుతుందన్నారు.