KMM: 100% రాయితీతో రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లలను పంపిణీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు సుమన్ రెడ్డి, మాజీ సొసైటీ డైరెక్టర్ శ్రీను అన్నారు. శనివారం తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు పెద్ద చెరువులో మత్స్యశాఖ సొసైటీ సభ్యులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.