జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా సిరిశెట్టి సంకీర్త్ నియమింపబడ్డారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి గ్రామానికి చెందిన ఆయన 2019 సివిల్ సర్వీసెస్ పరీక్షలో 330వ ర్యాంకు సాధించి, ఐపీఎస్ హోదాను దక్కించుకున్నారు. శుక్రవారం పలువురు IPSలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుత SP కిరణ్ ఖరే స్థానంలో సంకీర్త్ రానున్నారు.