SRCL: చందుర్తి మండలం సనుగుల గ్రామంలో ప్రభుత్వవిప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పర్యటించారు. గ్రామంలోని ఎర్ర చెరువు పటేల్ చెరువు సమీపన కొండపైన గల శ్రీ గోవిందరాజుల స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు, ఆలయ అర్చకులు ఆది శ్రీనివాస్‌కు ఘన స్వాగతం పలికారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు.