BHPL: గోరికొత్తపల్లి (M) వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో ఇవాళ దివంగత ఎస్సై హరీష్ రుద్రారపు మొదటి వర్ధంతి కార్యక్రమం జరిగింది. MLA గండ్ర సత్యనారాయణ రావు హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హరీష్ విధి నిర్వహణలో చూపిన క్రమశిక్షణ, నిజాయితీ ఎప్పటికీ మర్చిపోలేనివని, ఆయన మరణం కుటుంబం నుంచి జిల్లా వరకు తీరని లోటని అన్నారు.