సత్యసాయి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా శనివారం పుట్టపర్తికి చేరుకున్నారు. పుట్టపర్తి విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు, కూటమి పార్టీల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. పుట్టపర్తి పర్యటనలో ఆయన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.