యువ నటీనటులు అఖిల్, తేజస్విని జంటగా నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ అప్డేట్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ.1.47 కోట్లకుపైగా వసూళ్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక తెలంగాణలో ఓ పల్లెటూరులోని ప్రేమ కథతో తెరకెక్కిన ఈ మూవీకి సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు.