NLG: నకిరేకల్, పద్మశాలి కాలనీలో నిరుపేద కుటుంబానికి చెందిన చేనేత కార్మికురాలు సుంకి సక్కుబాయమ్మ మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్ శనివారం మృతదేహాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి దహన సంస్కారాల కోసం సహాయం అందించారు.