AP: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్నారు. రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఘన స్వాగతం పలికారు. శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు. ఆమెతోపాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మంత్రులు లోకేష్, పొన్నం ప్రభాకర్, కలెక్టర్లు తదితరులు ఉత్సవాలకు హాజరుకానున్నారు.