KRNL: ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 32 మంది లబ్ధిదారులకు రూ. 13.58 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. వివిధ వ్యాధులు, ప్రమాదాల వల్ల ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని, ఈ సహాయం వారికి ఉపశమనం ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుందని చెప్పారు.