ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో భారత్-A జట్టు ఓటమిపాలైంది. అయితే, సూపర్ ఓవర్లో వైభవ్ సూర్యవంశీని ఎందుకు పంపలేదని విమర్శలు వస్తున్నాయి. దీనిపై కెప్టెన్ జితేష్ స్పందించాడు. డెత్ ఓవర్లలో తాను, అశుతోష్, రమణ్ హిట్టింగ్ చేయగలమని.. అందుకే సూపర్ ఓవర్లో తామే బ్యాటింగ్ చేసినట్లు తెలిపాడు. అలాగే, ఇది పూర్తిగా తన నిర్ణయం అని వెల్లడించాడు.