రోజుకు కేవలం ఒక్క నిమిషం గోడ కుర్చీ(Wall Sit) వ్యాయామంతో అనేక ప్రయోజనాలు పొందవచ్చు. నడుమును గోడకు ఆనిచ్చి మోకాళ్లు 90 డిగ్రీల కోణంలో ఉండేలా కూర్చోవాలి. పాదాలు పూర్తిగా నేలపై ఉండాలి. ఈ వ్యాయామం వల్ల కాళ్ల కండరాలు బలోపేతమవుతాయి. శరీరంలో అదనపు కొవ్వు కరుగుతుంది. రక్తపోటు(Blood Pressure) నియంత్రణలో ఉంటుంది. ఈ సులభమైన వ్యాయామం శరీరానికి బలాన్నిస్తుంది.