AP: కొత్త లేబర్ కోడ్స్.. భారత అభివృద్ధి దిశలో మైలురాయి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 1991 తర్వాత అత్యంత కీలక మార్పులుగా లేబర్ కోడ్స్ నిలుస్తాయని కొనియాడారు. ఉద్యోగుల భద్రత మరింత బలోపేతం, వేతనాల హామీ ఉంటుందని వెల్లడించారు. కార్మికుల గౌరవం, హక్కులకు ప్రాముఖ్యత, గిగ్ వర్కర్లకు ప్రత్యేక రక్షణ, మహిళలకు మరింత సమానత్వం లభిస్తుందని తెలిపారు.