ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2023 లోనే ఢిల్లీ సహా అనేక నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్టు ఉగ్రవాది ముజమ్మిల్ ఒప్పుకున్నాడు. రెండేళ్లుగా పేలుడు పదార్థాలు, ఇతర పరికరాలను ఉగ్రవాదులు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గురుగ్రామ్, నుహ్ నుంచి 26 క్వింటాళ్ల NPK ఎరువులను ముజమ్మిల్ కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.