BPT: కొరిశపాడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జరగనున్నట్లు ఇన్ఛార్జ్ ఎంపీడీవో చంద్రసేన్ తెలిపారు. ఈ సమావేశంలో 14 అంశాలతో కూడిన అజెండా రూపొందించామన్నారు. మండల పరిధిలో చేపట్టబోవు అభివృద్ధి పనులు గురించి ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందని వెల్లడించారు. అలాగే అన్ని శాఖల వారీగా సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.