KDP: వేంపల్లెలోని బాలిశెట్టి వీధిలో గోవా నుంచి మద్యం తరలించి ఇంట్లో నిల్వ ఉంచుకున్న గంగరాజు అనే వ్యక్తిని శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు ఎస్సై తిరుపాల్ నాయక్ తెలిపారు. అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారం అందడంతో సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించారు. అతని ఇంట్లో గోవాకు చెందిన 10 లీటర్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసామని ఎస్సై తెలిపారు.