NZB: చందూర్ మండలంలో గుప్త నిధుల తవ్వకాల ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఘన్పూర్ గ్రామ శివారులో నిన్న సాయంత్రం కొందరు నిమ్మకాయలు, పసుపు, కుంకమ చల్లి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు వెంటనే అక్కడికి చేరుకుని ఐదుగురిని పట్టుకుని వర్నిపోలీస్ స్టేషన్లో అప్పగించారు.