JGL: ‘స్వచ్ఛ మెట్పల్లి’ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పని చేసేటప్పుడు తప్పనిసరిగా ఆప్రాన్స్, క్లౌజులు, షూస్, హెల్మెట్, మాస్క్ ధరించాలని వారికి సూచించారు. పని ముగించిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోకపోతే వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించారు.