GNTR: తెనాలిలో శుక్రవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. యానాది కాలనీకి చెందిన కందుకూరి ఉష (38)పై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడికి దిగాడు. ఒంటిపై విచక్షణా రహితంగా దాడి చేయడంతో మహిళ ప్రాణాపాయ స్థితికి చేరింది. స్థానికులు హుటాహుటిన ఆమెను తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి గుంటూరుకు తీసుకువెళ్లారు.