ప్రకాశం: ఒంగోలులోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో లింగ నిర్ధారణ చట్టంపై జిల్లా స్థాయి అడ్వైజర్ కమిటీ సమావేశం జరిగింది. DMHO డాక్టర్ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా పలువురు వైద్యాధికారులు హాజరయ్యారు. అనంతరం DMHO మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేసి, స్కానింగ్ చేసే డాక్టర్స్ విద్యార్హతలను పరిశీలించాలని ఆదేశించారు.