KKD: పిఠాపురం సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అదనపు ప్రభుత్వ ప్లీడరుగా (AGP)సీనియర్ న్యాయవాది పండ్రవరపు వెంకట శ్రీరామచంద్రమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. పిఠాపురం బార్ అసోసియేషన్లో 30 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్న మూర్తి సివిల్ కేసుల్లో నిష్ణాతుడిగా, మృదు స్వభావిగా మంచి గుర్తింపు పొందారు.