TG: బెంగళూరులో దారుణం జరిగింది. బేగంపేటలో ఓ ఏవియేషన్ సంస్థలో పనిచేసే యువతిపై అదే సంస్థలో పనిచేస్తున్న రోహిత్ శరణ్ అత్యాచారయత్నం చేశాడు. పని నిమిత్తం ఇద్దరు కలిసి బెంగళూరు వెళ్లగా అక్కడి హోటల్ గదిలో అత్యాచారం చేయడానికి రోహిత్ ప్రయత్నించాడు. అయితే ఆమె అతడిని ప్రతిఘటించి అక్కడి నుంచి పారిపోయి వచ్చి హైదరాబాద్లోని బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది.