E G: కడియం మండలం దుళ్ల దళిత వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ. లక్ష ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ఎస్సీ పేటకు చెందిన గుర్రపు వెంకట్రావ్ శుక్రవారం రాత్రి TV ఆన్ చేసి చూస్తూ నిద్రకు ఉపక్రమించాడు. అయితే TV ఆఫ్ చేయకపోవడంతో ఓవర్ హీట్‌తో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదం జరిగి వుండొచ్చని భావిస్తున్నారు.