SC, ST రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై తాను ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉన్నానని సీజేఐ జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. తన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘అధికారి కొడుకును, వ్యవసాయ కూలీ కొడుకుతో పోటీ పడేలా చేయలేం’ అని ఆయన అన్నారు. ఆర్టికల్ 14 (సమానత్వం) అంటే అందరినీ సమానంగా చూడటం కాదు, వెనుకబడిన వారిని ప్రత్యేకంగా పరిగణించాలి అనేదే అసలైన భావన అని పేర్కొన్నారు.