మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ‘వారణాసి’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మ్యూజికల్ అప్డేట్ ఇచ్చారు. ఇందులో మొత్తం ఆరు పాటలు ఉన్నట్లు వెల్లడించారు. కాగా, ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ‘సంచారి’.. ‘రణ కుంభ’ అనే సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. దర్శక ధీరుడు తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ 2027 వేసవిలో విడుదల కానుంది.